AP EAMCET 2025 Counselling Schedule:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఈ రోజు ఏపీ ఎంసెట్ కన్వీనర్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. జూలై 7వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదుకు విద్యార్థులు ఫీజు చెల్లించాలి. అప్పటికీ, విద్యార్థులు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరై అన్ని ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలను సమర్పించి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్‌లో కాలేజీలను ఎంపిక చేసుకున్న విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ చేసి సంబంధిత కాలేజీలలో అడ్మిషన్స్ ఇస్తారు. మొదటి విడత కౌన్సిలింగ్లో ఎంపికైన విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీ నుండి తరగతుల ప్రారంభం కానున్నాయి. ఈ రోజు విడుదలైన ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
AP EAMCET 2025: 10,000 నుండి 1,60,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది – ఇప్పుడే తెలుసుకోండి.
AP EAMCET 2025 counselling dates:
ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల తేదీ | 4th July, 2025 |
పత్రికా ప్రకటన విడుదల తేదీ | 5th July, 2025 |
రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లించే తేదీలు | 7th July, 2025 – 16th July, 2025 |
అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు (HLC’s వద్ద ) | 7th July నుండి 17th జూలై వరకు |
వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసే తేదీలు | 10th July నుండి 18th July వరకు |
వెబ్ ఆప్షన్స్ మార్చుకునే తేదీ | 19th July, 2025 |
సీట్ అలాట్మెంట్ చేసే తేదీ | 22nd July, 2025 |
సీటు పొందిన కాలేజీలలో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చే తేదీ | 23rd July, 2025 |
మొదటి సంవత్సర తరగతుల ప్రారంభమయ్యే తేదీ | 4th August, 2025 |
గమనిక: పైన తెలిపిన షెడ్యూల్ అధికారికంగా విడుదల చేయబడింది. విద్యార్థులు ఆ షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరుకావచ్చు.
AP ఎంసెట్ 2025, ఇంటర్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 6వ తేదీలోపు వెబ్సైట్లో సమర్పించాల్సిన పత్రాలు/వివరాలు: వెంటనే చూడండి
ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కు కావలసిన సర్టిఫికెట్స్:
కౌన్సిలింగ్‌కి హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది సర్టిఫికెట్లను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒరిజినల్ మరియు జిరాక్స్ పత్రాలను రెడీ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ సమయంలో ఆన్లైన్లో చెల్లించిన ఫీజు రిసిప్ట్ ఉండాలి
- ఎపి ఎంసెట్ 2025 హాల్ టికెట్
- ఎపి ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డు
- 10వ తరగతి మార్క్స్ మెమో
- 10+2/ ఇంటర్ మార్క్స్ మెమో
- ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)
- కుల ధ్రువీకరణ పత్రాలు (SC, ST, BC, EWS)
- ఇన్కమ్ సర్టిఫికెట్
- PWD సదరం సర్టిఫికేట్
- ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉండాలి.
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్‌కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
సర్టిఫికెట్ల పరిశీలన ఎక్కడ చేస్తారు?:
ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ సమయంలో సంబంధిత గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీజు చెల్లించిన విద్యార్థులు, మీకు సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రాలు (HLCs) లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ పత్రాలను సమర్పించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.
🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి మరియు మరిన్ని వివరాల కోసం మా అధికారిక వెబ్సైట్ JOBSBIN.IN ని సందర్శించండి.