NEET 2025 Counselling Schedule:
NEET UG 2025 పరీక్ష ఫలితాలు జూన్ 14న విడుదలయ్యాక, కౌన్సిలింగ్ ప్రారంభం ఎప్పుడు ఉంటుందనేది చాలామంది విద్యార్థులకు ఆసక్తికరమైన అంశం. MCC (Medical Counselling Committee) నిర్వహించే ఆల్ ఇండియా క్వోటా (AIQ) 15% కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కౌన్సెలింగ్కు సంబంధించి విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్లు మరియు కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ ఆర్టికల్లో సంపూర్ణ సమాచారం తెలుసుకుందాం.
NEET 2025 కౌన్సిలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్:
- NEET UG 2025 ర్యాంక్ కార్డ్ (Rank Card)
- NEET 2025 పరీక్ష యొక్క అడ్మిట్ కార్డ్ (Original Admit Card)
- 10th మరియు 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ (Marks List for 10th and 12th Classes)
- కుల ధ్రువీకరణ పత్రాలు (Caste Certificate – SC, ST, OBC, OC)
- Domicile సర్టిఫికెట్ (Domicile Certificate for State Counseling)
- ఇన్కమ్ సర్టిఫికెట్లు (Income Certificate for EWS Candidates)
- వాలిడ్ ఫోటో ఐడి (Valid Photo ID, e.g., Aadhaar Card, PAN Card, Voter ID)
- 6-8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ (6-8 Passport Sized Photographs)
- ప్రొఫెషనల్ అలాట్మెంట్ సర్టిఫికెట్ (Professional Allotment Certificate – Will be available after counseling)
NEET UG 2025 expected counselling schedule:
- ప్రారంభ తేదీ: జూలై 1, 2025
- మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 1, 2025 నుండి ప్రారంభమవుతుంది.
- ఛాయిస్ ఫిల్లింగ్ & లాక్ చేయడం: రిజిస్ట్రేషన్ తర్వాత మూడు రోజుల్లో మొత్తం జరుగుతుంది.
- సీట్ అలేట్మెంట్ ఫలితాలు విడుదల తేదీ: మొదటి రౌండ్ ఫలితాలు జూలై 6 నుండి 8 మధ్య విడుదల కానున్నాయి.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ & జాయినింగ్: కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి అలర్ట్ చేసిన తర్వాత జరుగుతుంది.
NEET 2025 కౌన్సిలింగ్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
- అధికారిక వెబ్సైట్ https://mcc.nic.in ఓపెన్ చేయండి.
- “UG Medical Counselling 2025” సెక్షన్ పై క్లిక్ చేయండి.
- “New Registration 2025” పై క్లిక్ చేసి వివరాలను నింపండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి:
- సాధారణ వర్గానికి – ₹1,000/-
- SC/ST/OBC వర్గానికి – ₹500/-
- కౌన్సిలింగ్ రౌండ్ కు అనుగుణంగా ఛాయిస్ ఫిల్లింగ్ చేయండి.
- సీటు అలవాటయ్యాక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి జాయిన్ అవ్వండి.

ముఖ్యమైన సూచనలు:
- కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతుంది.
- మీరు ఇచ్చిన డేటాలో సందేహాలు ఉంటే, మీ సీటు కన్ఫర్ట్ కాకపోవచ్చు.
- ఒకే విద్యార్థి మల్టిపుల్ రౌండ్స్ లో అప్లై చేసుకునే అవకాశం ఉంది.
- NEET 2025 కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి MCC నుండి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
- జూలై 1, 2025 నుండి కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
- కౌన్సిలింగ్ మొదలైన తర్వాత ముందుగానే అప్లై చేయడం ద్వారా మీరు మీ ఎంచుకున్న కాలేజీల్లో సీటు పొందే అవకాశం పెరుగుతుంది.
మా వెబ్సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .
1 thought on “NEET 2025 Counselling Dates: Schedule & Required Certificates List”