AP Inter Supplementary Exams 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరాల సప్లిమెంటరీ రాత పరీక్షలు మే 20 తేదీన ముగిశాయి. ఈ ఫలితాలను విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటగా జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నప్పటికీ, మే 31 తేదీన ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇది డిగ్రీ అడ్మిషన్స్ కోసం కొంత ఉపశమనం కల్పించడానికి ఉద్దేశించబడింది. సుమారు మూడు లక్షల నుంచి నాలుగ మంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల తేదీ :
ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మే 31వ తేదీకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటగా జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని యోచించిన ఇంటర్ బోర్డ్ అధికారులు, అందులోనే ముందుగానే ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు తమ ఫలితాలను వాట్సాప్ మరియు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
వాట్సాప్ లో ఎలా ఫలితాలు చూడాలి?:
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మీ వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకు మీరు క్రింద పేర్కొన్న స్టెప్ బై స్టెప్ ప్రక్రియను అనుసరించండి:
- ముందుగా మీ వాట్సాప్‌లో
+919552300009మానమిత్ర నెంబర్‌కు “హాయ్” అని మెసేజ్ పంపండి. - సర్వీస్ ఎంచుకోండి అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆప్షన్లలోకి వెళ్లండి.
- అందులో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఆప్షన్‌ను ఎంచుకోండి.
- హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
- వెంటనే, స్క్రీన్‌పై ఫలితాలు డౌన్‌లోడ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP Inter Supplementary Results Website
Ydgeveevevr