తెలంగాణ జీపీవో(GPO) ఫలితాలు విడుదలయ్యాయి. మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు! @ccla.telangana.gov.in

Telegram Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పరిపాలన అధికారి (జీపీవో) పోస్టుల భర్తీకి ఈ నెల 25న నిర్వహించిన పరీక్ష యొక్క ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3,550 మంది పూర్వపు వీఆర్వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) మరియు వీఆర్ఎ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) అభ్యర్థులు ఈ పరీక్షలో ఎంపికయ్యారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల ర్యాంకులను ccla.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా 10,954 జీపీవో పోస్టులు అందుబాటులో ఉండగా, ఇప్పటికీ 3,550 మంది మాత్రమే ఎంపికయ్యారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు తెలిపిన ప్రకారం, ఎంపికైన అభ్యర్థులకు రాబోయే 2-3 రోజుల్లో నియామక పత్రాలు అందించే అవకాశముంది. మిగిలిన పోస్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభ్యర్థులు వేచెస్టాట్లు ఉండాలి. ఈ ఎంపిక ప్రక్రియ రాష్ట్రంలో గ్రామీణ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడానికి కీలకమైనదిగా భావిస్తున్నారు.

OFFICAL WEBSITE

Telegram Channel Join Now

Leave a Comment