India Post GDS 2025 మూడో మెరిట్ లిస్ట్ విడుదల: ఫలితాలను చెక్ చేసుకోండి @indiapostgdsonline.gov.in/

21,413 పోస్టులతో పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల మూడో మెరిట్ లిస్టు అధికారికంగా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అన్ని పోస్టల్ సర్కిల్స్ సంబంధిత 3వ లిస్టు విడుదల చేయబడింది.

పదో తరగతి అర్హత కలిగి ఉన్న 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోబడిన విద్యార్థులు, వెంటనే మీ పేరు లిస్టులో ఉందా అనేది చెక్ చేసుకోండి. లిస్టులో పేరున్న అభ్యర్థులు, నివేదિત తేదీలోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కాని అభ్యర్థుల స్థానంలో మరొకరిని అవకాశం కల్పించడానికి 4వ లిస్ట్ లో వారి పేరును ఉంచడం జరుగుతుంది.

ఈ ఆర్టికల్ లోని పూర్తి సమాచారాన్ని చూసి, త్వరగా పోస్టల్ GDS ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి.

పోస్టల్ GDS 3rd లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?:

గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల మూడో లిస్టును డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన స్టెప్ బై స్టెప్ ప్రక్రియను అనుసరించండి మరియు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 2025 రిజల్ట్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి
  3. అందులో సర్కిల్స్ వారీగా అనగా రాష్ట్రాల వారీగా 3వ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
  4. ఆ లిస్టు పిడిఎఫ్ లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కు హాజరవ్వాల్సిన ఆఖరి తేదీ:

మూడో మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు జూన్ 3వ తేదీకి ముందే కావాల్సిన సర్టిఫికెట్లు సమకూర్చుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. హాజరుకాకపోతే, వారి స్థానంలో మరొక వ్యక్తికి నాల్గవ లిస్టులో అవకాశం కల్పించబడుతుంది.

Postal GDS 3rd Merit List: AP

Postal GDS 3rd Merit List: TS

Official Website

మొత్తం ఎన్ని పోస్టులు?:

2025 జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 21,413 పోస్టులతో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పదో తరగతి అర్హత కలిగిన 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు రెండు మెరిట್ లిస్టులు విడుదల చేసిన తరువాత, మూడో మెరిట్ లిస్టు కూడా తాజాగా విడుదల చేయబడింది.

FAQ’s:

  1. పోస్టల్ GDS 2025 4వ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది?

4వ GDS మెరిట్ లిస్టు జూలయ్ మూడో వారంలో విడుదల చేయబడనుంది.

  1. పోస్టల్ GDS 2025 షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?

షెడ్యూల్ 2 నోటిఫికేషన్ జూలయ్ లేదా ఆగస్టులో విడుదల చేయబడనుంది.

Leave a Comment