AP Annadhatha Sukhibhava Scheme 2025: రైతుల ఖాతాల్లోకి ఒక్కసారిగా ₹20,000/- విడుదల – రైతన్నలకు గొప్ప శుభవార్త!

Telegram Channel Join Now

AP Annadhatha Sukhibhava Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులకు ఒక ప్రత్యేక శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈసారి రైతులకు ఒక్కసారిగా ₹20,000/- చెల్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ మొత్తం డబ్బును విడుదల చేయనున్నట్లు సమాచారం.

విడతల వారీగా ₹20,000/- రూపాయలు విడుదల చేసే తేదీలు:

మొత్తం విడతలుమంజూరైన మొత్తం
జూన్ 2025 ( నెలాఖరకు)₹2,000/- కేంద్ర ప్రభుత్వం + ₹5,000/- రాష్ట్ర ప్రభుత్వం
అక్టోబర్ 2025₹7,000/-
జనవరి 2026₹6,000/-
మొత్తం డబ్బులు₹20,000/-


ఈ పథకానికి ఎవరు అర్హులు?:

అర్హత పొందడానికి కొంత ముఖ్యమైన సమాచారం:

  • రాష్ట్రంలోని చిన్న మరియు మధ్య తరహా రైతులు అర్హులు.
  • పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న వ్యక్తులు.
  • గతంలో రైతు భరోసా, అన్నదాత సుఖీభవ లేదా పీఎం కిసాన్ పథకాలు పొందినవారు.
  • ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయబడినవారు అర్హులు.

ఈ పథకము యొక్క ముఖ్య లక్ష్యం:

  • రైతులకు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం ఇవ్వడం కోసం ఆర్థిక సాయం అందించడం.
  • విత్తనాలు, ఎరువులు మరియు సస్యరక్షణ మందులకు అవసరమైన సహాయం అందించడం.
  • రైతుల లోన్ ఆధారిత పరిస్థితిని తగ్గించడం ఇది ప్రధాన లక్ష్యం.

లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి?:

అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాను చెక్ చేయడానికి రెండు విధానాలు ఉన్నాయి:

విధానం 1:

  1. ముందుగా అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్ ను ఓపెన్ చేయండి.
  2. వెబ్‌సైట్ హోం పేజ్ లో “check Status Now” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. లబ్ధిదారుడి ఆధార్ నెంబర్ లేదా పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయండి.
  4. Get Details” పై క్లిక్ చేస్తే, మీరు ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారా అన్నది తెలబడుతుంది.

విధానం 2:

  • మీరు లబ్ధిదారులు అయితే, మీ సమీప గ్రామ సచివాలయానికి వెళ్లి, అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి.
  • గ్రామ సచివాలయం అధికారులు తాజా అర్హుల జాబితా PDF అందుబాటులో ఉంటుంది. అందులో సమాచారం చెక్ చేయండి.
  • మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి సులభంగా వివరాలను చూసుకోండి.

AP Annadhatha Sukhibhava Website

అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే, మొత్తం మూడు విడతల్లో మీ ఖాతాలో డబ్బులు డిపాజిట్ అవుతాయి. అర్హుల జాబితాలో లేనివారు కొత్తగా అప్లై చేయడానికి కావాల్సిన సమాచారాన్ని గ్రామ సచివాలయంలోని అధికారులను అడిగి తెలుసుకోండి. పత్రాలు సబ్మిట్ చేసిన తర్వాత మీకు అర్హత లభించి, మీ అకౌంట్ లో కూడా అన్నదాత సुखీభవ పథకంలో డబ్బులు డిపాజిట్ అవుతాయి.

మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .

Telegram Channel Join Now