AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. అయితే, కొన్ని తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. డబ్బులు వేయబడకపోతే, అర్హత కలిగి ఉన్న లబ్ధిదారులు జూన్ 20వ తేదీ లోగా తమ అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది.
ప్రరి కార్యం, అభ్యంతరాలు సమర్పించిన లబ్ధిదారుల సర్టిఫికెట్ల పరిశీలన జూన్ 28వ తేదీ వరకు జరుగుతుంది. జూన్ 30వ తేదీ న రెండో విడత అర్హుల జాబితా విడుదల చేయబడుతుంది. ఈ జాబితాలో ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లో జూలై 5వ తేదీ న డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు, రెండో జాబితా యొక్క ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం.
తల్లికి వందనం పథకం రెండవ జాబితా (Phase 2) అధికారిక షెడ్యూల్:
- తల్లికి వందనం పథకం ప్రారంభించిన తేదీ: జూన్ 12, 2025
- అర్హుల మరియు అర్హత లేని జాబితా ప్రదర్శన తేదీ: జూన్ 12, 2025
- అభ్యంతరాల స్వీకరణ తేదీలు: జూన్ 12 నుండి 20 మధ్య
- గ్రీవెన్స్ వెరిఫికేషన్ మరియు సప్లిమెంటరీ జాబితా తయారీ తేదీలు: జూన్ 21 నుండి 28 మధ్య
- ఫైనల్ జాబితా విడుదల తేదీ (ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు): జూన్ 30, 2025
- ఫైనల్ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ: జూలై 5, 2025
ఎంత నగదు డిపాజిట్ అవుతుంది?:
తల్లికి వందనం పథకానికి అర్హత పొందిన లబ్ధిదారులకు విద్యార్థి తల్లి అకౌంట్లో ₹15,000/- బదులుగా ₹13,000/- డిపాజిట్ చేస్తారు.
- ₹15,000/- రూపాయలలో ₹2,000/- రూపాయలు పాఠశాలల మెయింటెనెన్స్ కోసం కట్ చేయబడతాయి.
- ఎంత మంది పిల్లలు ఉన్నా, ప్రతి ఒక్కరికి ₹13,000/- చొప్పున డిపాజిట్ చేయబడును.
రెండవ జాబితాలో (Phase 2 List) మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి?:
రెండో విడత జాబితాలో మీకు పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి, మీ సమీపంలోని గ్రామ సచివాలయానికి వెళ్లండి. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులను సంప్రదించండి. వారు మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసి మీకు చెప్తారు.
- మీ పేరు రెండవ జాబితాలో ఉంటే, జూలై 5వ తేదీన మీకు డబ్బులు డిపాజిట్ అవుతాయి.
గ్రామ సచివాలయంలో వారు, ఏపీ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తల్లికి వందనం పథకం జాబితాను చెక్ చేసుకోవచ్చు.
మనమిత్ర వాట్సాప్ నంబర్: +91 95523 00009
Summarised Dates List:
అంశము | తేదీ |
పథకం ప్రారంభ తేదీ | 12th జూన్, 2025 |
గ్రీవెన్స్ స్వీకరణ ఆఖరి తేదీ | 20th జూన్, 2025 |
గ్రీవెన్స్ పరిశీలనా మరియు సప్లిమెంటరీ జాబితా తేదీ | 21- 28th జూన్, 2025 |
ఫైనల్ జాబితా ప్రదర్శన తేదీ | 30th జూన్, 2025 |
రెండో విడత డబ్బులు డిపాజిట్ తేదీ | 5th జూలై, 2025 |
మీకు తల్లికి వందనం పథకం డబ్బుల డిపాజిట్ మరియు అర్హుల జాబితా విషయంలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, కింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో అడగండి. మీ సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది.
మా వెబ్సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .
Free education unte talliki vandanam payment vastunda