తెలంగాణ గ్రూప్ -2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ | Exam Dates | Hall tickets పూర్తి వివరాలు డేట్స్ వచ్చాయి @tspsc.gov.in/

Telegram Channel Join Now

గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్న టీజీపీ ఎస్సీ

గ్రూప్-2 అభ్యర్థుల సర్టి ఫికెట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. రెండు రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భా విస్తున్నది. ఇందుకోసం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్ -2 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ లో పరీక్షలు జరిగాయి. 5,51,855 మంది అప్లై చేసుకోగా.. 2,49,964 మంది అటెండ్అయ్యారు. పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చిన మార్కులతోపాటు 2,36,649 మందికి సంబంధించిన జనరల్ ర్యాకింగ్ లిస్టులను ఈ ఏడాది మార్చి లో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. వారిలో రిజర్వేషన్లకు అనుగుణంగా 1:1 కేటగి రీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాలని కమిషన్ భావిస్తున్నది.

GROUP – 2 OFFICIAL WEBSITE

రెండు వారాల పాటు ప్రక్రియ.. గ్రూప్-2 కంటే ముందే టీజీపీఎస్సీ 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 ఫలితాలను రిలీజ్ చేసింది. మెయిన్స్ కు 21,093 మంది అటెండ్ అయితే, వారిలో 12,622 మంది క్వాలిఫై అయ్యారు. గ్రూప్- 1 పోస్టుల భర్తీ తర్వాతే గ్రూప్ -2 పోస్టులను నింపాలని భావించిన టీజీ పీఎస్సీ.. ముందుగా గ్రూప్ -1 క్యాండిడేట్ల సర్టిఫి కెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తిచేసింది. అయితే, గ్రూప్ – 1పై కొందరు అభ్యర్థులు కోర్టులో కేసు వేశారు. వచ్చే నెల రెండోవారంలో హియరింగ్ కు రానున్నది.

ఈ గ్యాప్లో గ్రూప్-2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని టీజీపీఎస్సీ భావించింది. దానికి అనుగుణంగా ఈ నెలాఖరులోపు 1:1 ని ష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని డిసైడ్ అయింది. సుమారు 2 వారాలపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నది. కాగా, గ్రూప్ -2 ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టు ఇవ్వాలా? వద్దా? అనేది గ్రూప్ -1 పై హైకోర్టు తీర్పు తర్వాత టీజీ పీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

TELANGANA STATE PUBLIC SERVICE

చాలామంది అభ్యర్థులు గ్రూప్-1, గ్రూప్-2 కు సెలెక్ట్ అయ్యారు. ఒకవేళ ముందుగా గ్రూప్- 2 సెలెక్షన్ లిస్టు రిలీజ్ చేస్తే.. వారు జాయిన్ అయిన తర్వాత గ్రూప్-1 వస్తే మళ్లీ అటు వైపే వెళ్లే అవకాశం ఉంది. దీంతో పోస్టులు బ్యాక్ లాగ్ అయ్యే ప్రమాదం ఉన్నది. దీనిపై సర్కారుతో సం ప్రదించి, ఆ తర్వాతే గ్రూప్ -2పై నిర్ణయం తీసుకో వాలని టీజీపీఎస్సీ భావిస్తున్నది.

Telegram Channel Join Now

Leave a Comment