AP Annadhatha Sukhibhava Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన “అన్నదాత సుఖీభవ” పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలలోనే, రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే మొదటి విడత డబ్బులు కూడా కలుపుకొని మొత్తం ₹7,000/- రైతుల ఖాతాల్లో నేరుగా డిపాజిట్ చేయనుంది.ఈ అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు, వారు ఈ పథకానికి అర్హులా కాదా అనే విషయం తెలుసుకోవడానికి, అధికారిక వెబ్సైట్‌లో Status లింక్ ను ఆక్టివేట్ చేయడం జరిగింది. స్టేటస్ లో మీ eKYC ప్రాసెస్ పూర్తి అయిందా లేదా, అలాగే మీరు ఈ పథకానికి ELIGIBLE అయ్యారా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. రైతులు తమ ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పై స్టేటస్ చూపించబడుతుంది.అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా, మీ eKYC పూర్తి అయ్యిందా అనే పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
PM Kisan: అన్నదాతలకు శుభవార్త.. పీఎం కిసాన్ 20వ విడుత నిధుల విడుదల డేట్ ఫిక్స్..!
మొత్తం ఎన్ని విడతల్లో ఎంత డబ్బు డిపాజిట్ చేస్తారు?:
అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు
ఈ నిధులను మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరగుతుంది. వివరాలు క్రింద ఉన్నాయి:
- మొదటి విడత: ₹7,000/- డబ్బులు జమ : జూలై, 2025
- రెండవ విడత: ₹7,000/- డబ్బులు జమ : నవంబర్, 2025
- మూడవ విడత: ₹6,000/- డబ్బులు జమ : జనవరి, 2026
ఇలా మూడు విడతల్లో మొత్తం ₹20,000/- నిధులు రైతుల అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం జమ చేస్తుంది.
తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా విడుదల చేశారు : మీ పేరు చెక్ చేసుకోండి
Status ఎలా చెక్ చేసుకోవాలి?:
అన్నదాత సుఖీభవ 2025 పథకానికి మీకు అర్హత ఉందా లేక కాదు? తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్-बై-స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి:
- ముందుగా అర్హత తెలుసుకోవడానికి అనుబంధిత అధికారిక వెబ్సైట్ (Annadhatha Sukhibhava Website) ని ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజ్ లో “Know Your Status” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- క్లిక్ చేసిన తర్వాత పేజీ ఓపెన్ కాకపోతే, వెబ్‌సైట్‌ని “Refresh” చేసి మళ్లీ “Know Your Status” లింక్ పై క్లిక్ చేయండి.
- లబ్ధిదారుని 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, పక్కనే ఉన్న Captcha కోడ్ ఎంటర్ చేసి “Submit” పై క్లిక్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన లబ్ధిదారుని పేరు, మండలం, గ్రామం పేరు, అర్హత (Eligible), eKYC పూర్తయ్యిందా (eKYC Completed) వంటి పూర్తి వివరాలు చూపిస్తాయి.
- “Eligible” అని వచ్చినట్లయితే, ఆ రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు డిపాజిట్ అవుతాయి.
- “Ineligible” అని చూపిస్తే, మీ దగ్గర ఆ గ్రామ సచివాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకుని మళ్లీ అప్లై చేయండి.
Annadhatha Sukhibhava Status Check Website

eKYC ఎలా చేసుకోవాలి?:
అన్నదాత సుఖీభవ పథకానికి eKYC ప్రక్రియను ఈ క్రింది విధంగా నమోదు చేయండి:
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి.
- eKYC అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- లబ్ధిదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
- OTP ద్వారా వెరిఫై చేయండి.
- స్క్రీన్ పైన eKYC Successful అని చూపిస్తుంది.
మీరు పై విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా మీ eKYC పూర్తి అయ్యిందా అనే విషయాలను తెలుసుకోవచ్చు.
మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .