🏥 ఆంధ్రప్రదేశ్ కొత్త ఆరోగ్య భీమా పథకం – ప్రజలందరికీ హెల్త్ కవరేజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ వర్తించేలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందించడానికి ఒక ప్రతిష్టాత్మకమైన కొత్త ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన తాజా క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం లభించింది.
🔥 కొత్త హెల్త్ పాలసీ ఆమోదం
👉 రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకం మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను సమ్మిళితం చేసి, ఒక హైబ్రిడ్ ఆరోగ్య విధానంగా రూపొందించారు.
👉 ఈ కొత్త పథకం ద్వారా రాష్ట్రంలో గల పౌరులందరికీ ఆరోగ్య భీమా లభించనుంది.
👉 ముఖ్యంగా పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
ఏపీలో పదో తరగతి అర్హతతో ఆశ కార్యకర్త ఉద్యోగాలు – Click here
🔥 పథకం అమలు విధానం
👉 రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు భీమా కంపెనీల నుండి టెండర్లను ఆహ్వానించనుంది.
👉 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ మొత్తం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించబడుతుంది.
👉 2.5 లక్షల నుండి 22.5 లక్షల వరకు అవసరమయ్యే ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా భరించనున్నారు.
👉 మొత్తం 25 లక్షల వరకు వైద్య ఖర్చులు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి.
🔥 ఎవరికీ ఈ పథకం వర్తిస్తుంది?
👉 రాష్ట్రంలో గల పేదలందరికీ ప్రధానంగా ఈ భీమా వర్తిస్తుంది.
👉 రాష్ట్రంలోని సుమారు 5 కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
👉 ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) లో ఉన్నవారిని మినహాయించి మిగతా అందరికీ ఇది వర్తిస్తుంది.
👉 దారిద్ర రేఖకు పైబడిన కుటుంబాలకు (APL) 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తారు.
👉 వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఈ పథకంలో భాగం కానున్నారు.
✅కౌశలం సర్వేలో ఇలా అప్లై చేయండి – Click here
🔥 6 గంటల్లో ఉచిత వైద్యం
👉 ఏ పౌరుడు ఈ పథకంలో నమోదు చేసి హాస్పిటల్ లో చేరినా 6 గంటల్లోగా ఉచిత వైద్యానికి అనుమతి లభిస్తుంది.
👉 హాస్పిటల్ బిల్లులను కేవలం 15 రోజుల్లో రీయింబర్స్ చేస్తారు.
👉 మొత్తం 3257 వైద్య సేవలు ఈ పథకంలో కవర్ చేయబడతాయి.
👉 ప్రభుత్వ హాస్పిటల్స్ లో 324 ప్రత్యేక వైద్య సేవలకు ఈ పథకం వర్తిస్తుంది.
👉 ప్రతి పేషంట్ కి ప్రత్యేకంగా QR కోడ్ కేటాయించి, అందుతున్న సేవలను పర్యవేక్షిస్తారు.
👉 ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ & కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు.
🔥 భారీ ఆర్థిక భారం
👉 ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ₹10,000 కోట్ల నుండి ₹12,000 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.
👉 ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.
👉 అందులో 95% ప్రజలు 2.5 లక్షల లోపు వైద్య ఖర్చుతో చికిత్స పొందుతున్నారు.
👉 కేవలం 5% లో 3% మంది ప్రజలకు 5 లక్షల వరకు, 2% ప్రజలకు 15 లక్షల లోపు ఖర్చు అవుతుంది.
👉 ఈ గణాంకాల ఆధారంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
👉 ప్రభుత్వం ప్రీమియం మొత్తాన్ని చెల్లించి 2.5 లక్షల ఇన్సూరెన్స్ అందించనుంది. మిగిలిన మొత్తం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ హెల్త్ కార్డులు జారీ చేస్తారు.
🔥 ముఖ్య ఉద్దేశ్యం
ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించడమే కాకుండా, ప్రాణ రక్షణకు తోడ్పడటం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్న 2493 నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లో భాగం కానున్నాయి.
రాష్ట్రంలో ప్రతి పౌరుడూ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లో భాగం కావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
👉 ఈ కొత్త ఆరోగ్య భీమా పథకం మీద మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఈ పథకంపై తాజా అప్‌డేట్స్ ను మేము మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం.
🔥ఇంకా అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి – మీకు కావాల్సిన ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మీ తెలుగులో! మరింత సమాచారం కోసం “Subscribe” చేయండి ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఎవరికైనా ఇది అవసరమవుతుందనిపిస్తే – షేర్ చేయండి✅