ఏపీ జిల్లా కోర్టు పరీక్షా తేదీలు 2025 ప్రకటించబడ్డాయి | ఏపీ జిల్లా కోర్టు పరీక్షల షెడ్యూల్ | హాల్ టికెట్లు 2025

Telegram Channel Join Now

AP High Court Exams Dates 2025:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 06-05-2025 న జిల్లాకోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తనిఖీ అభ్యర్థులు — పరీక్షా తేదీల కోసం వేచి చూస్తున్న వారికి ఇదొక ముఖ్యమైన అప్డేట్…

10-07-2025 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరీక్ష తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో నిర్వహించనున్నారు.

ఏపీ జిల్లా కోర్టు పరీక్షల షెడ్యూల్ 2025 :

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్ (లైట్ వెహికల్), రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదల అయింది.

AP జిల్లా కోర్టు పరీక్ష తేదీలు ప్రకటించబడ్డాయి:

  • డ్రైవర్, ప్రాసెస్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 20 మరియు 21 తేదీల్లో మొత్తం ఆరు సెషన్లలో నిర్వహించబడుతుంది.
  • కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆగస్టు 22వ తేదీన రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించబడుతుంది.
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆగస్టు 23 మరియు 24 తేదీల్లో ఆరు సెషన్లలో పరీక్షలు నిర్వహించబడుతుంది.

హాల్ టికెట్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది దశలవారీగా ప్రక్రియను అనుసరించండి:

  1. ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  2. వెబ్‌సైట్‌లో “AP కోర్ట్ ఎగ్జామ్స్ 2025 హాల్ టికెట్ డౌన్లోడ్” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. అభ్యంతర యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  4. అభ్యర్థుల డాష్‌బోర్డ్‌లో, “హాల్ టికెట్ డౌన్లోడ్” అని ఉన్న ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  5. మీ హాల్ టికెట్ వెంటనే డౌన్లోడ్ అవుతుంది.
  6. అప్పుడు ప్రింట్ అవుట్ తీసుకోండి మరియు అందులో ఉన్న పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ విషయాలను గమనించండి.

AP Court Exams : Hall Tickets Download

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ఆగస్టు 13వ తేదీ నుండి హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అందువల్ల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ నుంచి ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలతో లాగిన్ అయ్యి టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Telegram Channel Join Now

Leave a Comment