AP Mega DSC 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి 16,347 పోస్టులలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి, ఇటీవల రాత పరీక్షలు ముగించిన సంగతి తెలిసిందే. దాదాపుగా 3.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారికి జూన్ 6వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. జూలై 4వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసి, విద్యాశాఖ అభ్యర్థుల యొక్క రిప్లై షీట్లను అధికారిక వెబ్సైట్లో అందించారు. అయితే, ఇప్పుడు జల్దీగా ఈ ఫలితాలను విడుదల చేసి, ఆగస్టు చివరి నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు విద్యాశాఖ అధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నియామకం ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తూ, పాఠశాలల్లో ఉపాధ్యాయులు జాయిన్ అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. నియామకానికి సంబంధించి తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ మెగా డిఎస్సి 2025 ఫైనల్ ఫలితాలు విడుదల ఎప్పుడు?:
ఏపీ మెగాడీ 2025 ఫైనల్ రిజల్ట్స్ జూలై చివరి వారంలో విడుదల చేయబడనున్నాయి. ఆగస్టు సమయానికి నియామక ప్రక్రియ పూర్తిచేయాలని, ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. జూలై 4వ తేదీన అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక వెంటనే, ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసి, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వబడుతుంది. ఈ విధంగా ఆగస్టు చివరి కు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశించినట్లు సమాచారం.
- ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ: జూలై చివరి వారానికి విడుదల చేయనున్నారు.
- ఏపీ మెగాడియేసి నియామక ప్రక్రియ పూర్తి చేయడానికి: ఆగస్టు నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
ఏపీ మెగా డీఎస్సీ ఆన్సర్ కీ, ఫైనల్ రిజల్ట్స్ ని ఎలా చెక్ చేసుకోవాలి?:
ఆంధ్రప్రదేశ్ మెగాడిఎస్సి ప్రాథమిక ఆన్సర్ మరియు ఫైనల్ రిజల్ట్స్ ని క్రింది దశల తరతమ్యం ద్వారా చూడవచ్చు:
- ముందుగా ఏపీ మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- వెబ్‌సైట్ హోమ్‌పేజీలో “AP Mega DSC 2025 answer key Download” లింక్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేసి ‘సబ్మిట్’ చేయండి.
- మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్‌తో పాటు, ఆన్సర్ కీని కూడా డౌన్లొడ్ చేసుకోండి.
- ఆన్సర్ కీలో ఉన్న సమాధానాలను, మీరు ఇచ్చిన సమాధానాలతో పోల్చండి.
- ప్రాథమిక ఆన్సర్ కీలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే, ఆధారాలతో పాటు అభ్యంతరాలను సమర్పించండి.
- ఫైనల్ రిజల్ట్స్ కూడా అదే విధంగా అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి, లాగిన్అయ్యి మీ ఫలితాలను చూడవచ్చు.
AP Mega DSC 2025 : Official Website
వివిధ ఉద్యోగ సమాచారాన్ని తక్షణమే మీ మొబైల్కు అందుకోవాలంటే, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో తక్షణమే చేరండి.

మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావడానికి - ఇక్కడ క్లిక్ చేయండి
FAQ’s:
- ఏపీ మెగా డీఎస్సీ 2025 ఉద్యోగ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసినారా?
జూలై 4వ తేదీన అన్ని పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీని తనిఖీ చేసి అభ్యంతరాలను సమర్పించాలి.
- ఏపీ మెగా డీఎస్సీలో 2025 ప్రాథమిక ఆన్సర్ కీ మరియు ఫైనల్ ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ ఏమిటి?
https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
🔥 ముఖ్యమైన గమనిక: ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ అయిన Jobs Bin లో ప్రతి రోజు ఉద్యోగ (News) సమాచారాన్ని అందిస్తున్నాము. అందువల్ల, మీరు ప్రతిరోజు మన వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.