AP RGUKT IIIT 2025 2nd Phase Results:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 ఐదు సంవత్సరాల డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇటీవల ఫలితాలు విడుదలయ్యాయి. మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న విద్యార్థులకు ప్రస్తుతం మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించబడుతోంది. నూజివీడు త్రిబుల్ ఐటీ, ఆర్కే వ్యాలీ త్రిబుల్ ఐటీ, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలలో విద్యార్థుల డాక్యుమెంట్లను పరిశీలించి, అనుగుణంగా సీడ్స్ అలొకేషన్లు అందిస్తున్నారు. అయితే, చాలా మంది మొదటి విడత కౌన్సిలింగ్‌కు హాజరు కాబోనందున, కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి. మిగిలిన సీట్లు కోసం 2nd ఫేజ్ ఫలితాలను విడుదల చేసి, రెండవ విడత కౌన్సిలింగ్ ప్రారంభించనున్నారు అని అధికారులు తెలిపారు. కాబట్టి, ప్రతి త్రిబుల్ ఐటీలో మిగిలిన సీట్ల సంఖ్య, రెండవ విడత కౌన్సిలింగ్ ప్రారంభ తేదీలు మరియు సెకండ్ ఫేజ్ ఫలితాల విడుదల తేదీ వంటి మొత్తం సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి విడత కౌన్సిలింగ్ లో ఎంత మంది చేరారు?:
- నూజివీడు క్యాంపస్ లో 1,010 సీట్లు ఉన్నాయి.
- అయితే, 871 విద్యార్థులు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు.
- ఇడుపులపాయ క్యాంపస్ లో కూడా 1,010 సీట్లు ఉన్నాయి.
- కానీ, 878 మంది మాత్రమే మొదటి విడత కౌన్సిలింగ్ కు హాజరయ్యారు.
- ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, ప్రతి త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో చాలా సీట్లు మిగిలిపోతున్నాయి.
- అధికారులు, మిగిలిపోయిన సీట్లను రెండవ విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.
AP IIIT 2025 2nd Phase Results 2025:
- మిగిలిపోయిన సీట్లకు రెండవ విడత కౌన్సిలింగ్ నిర్వహించాలి అంటే ముందుగా 2nd Phase Results ని విడుదల చేయాలి.
- 2nd Phase Results ని మరో రెండు లేదా మూడు రోజులతో విడుదల చేయాలి.
- విద్యార్థులు 2nd ఫేస్ రిజల్ట్స్ ని అధికారిక వెబ్సైట్ https://admissions25.rgukt.in/లో చెక్ చేసుకోవచ్చు.
- రెండో విడత కౌన్సిలింగ్ కి ఎంపికైన వారు సర్టిఫికెట్ల పరిశీలన కు హాజరు కావలసి ఉంటుంది.

రెండవ విడత కౌన్సిలింగ్ కు ఏ విద్యార్థులకు అవకాశం ఉంటుంది?:
- మొదటి విడతలో కౌన్సెలింగ్ కి హాజరు కాని విద్యార్థుల గురించి:
- వీరు రెండవ విడత కౌన్సెలింగ్ కి ఎంపిక అవుతున్నారు.
- వెయిటింగ్ లిస్టులో ఉన్న విద్యార్థుల గురించి:
- ఈ విద్యార్థుల కొరకు కూడా రెండవ విడత కౌన్సెలింగ్ లో అవకాశాలు ఉంటాయి.
- రెండవ విడత కౌన్సెలింగ్ వివరాలు:
- మొత్తం ఫలితాలు విడుదల తేదీకి సంబంధించి త్వరలో ప్రకటించబడతాయి.
- అధికారిక సమాచారం కోసం:
- విద్యార్థులు ప్రతిరోజు https://admissions25.rgukt.in/ వెబ్ సైట్ ని సందర్శించాలి.
మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .