AP ఎంసెట్ 2025, ఇంటర్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు జులై 6వ తేదీలోపు వెబ్‌సైట్‌లో సమర్పించాల్సిన పత్రాలు/వివరాలు: వెంటనే చూడండి

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జులై 6వ తేదీలోగా డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలని కన్వీనర్ తెలిపారు. ఈ మేరకు వెబ్‌సైట్‌లో కొత్త అప్‌డేట్ స్క్రోలింగ్ అవుతోంది. కాబట్టి, అర్హులైన విద్యార్థులు గడువులోగా డిక్లరేషన్ ఫారం నింపి సమర్పించాలి. పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

తల్లికి ఉంగరం పథకం లబ్ధిదారులకు అలెర్ట్: ఆ పిల్లల తల్లులకు ఈరోజు సాయంత్రం వరకే అవకాశం: వారికి ₹13,000/- డబ్బు జమ అవుతుంది.

AP ఎంసెట్ వెబ్ సైట్ లో డిక్లరేషన్ ఫారం ఎవరు సబ్మిట్ చేయాలి?:

ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో డిక్లరేషన్‌ ఫారంను ఈ కింది విద్యార్థులు తప్పనిసరిగా మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది:

  • ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ 2025లో ఉత్తీర్ణులైన వారు (అర్హత పొందిన వారు).
  • 2025లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసి, వాటిలో అర్హత పొందిన వారు.

డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ ఏమిటి?:

  • ఏపీ ఎంసెట్ డిక్లరేషన్ ఫారం: ఏపీ ఎంసెట్ డిక్లరేషన్ ఫారంలో వివరాలు పూర్తి చేయడానికి చివరి తేదీని అధికారులు జులై 6, 2025 గా ప్రకటించారు.
  • గడువులోగా పూర్తి చేయాలి: విద్యార్థులు గడువులోగా డిక్లరేషన్ ఫారంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి, ఎటువంటి తప్పులు లేకుండా ఫారాన్ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
New Last Date: July 6th, 2025

డిక్లరేషన్ ఫారం ఎలా పూర్తి చేయాలి?:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్‌సైట్‌లో డిక్లరేషన్ ఫారమ్ నింపడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ను అనుసరించండి:

  • ముందుగా, ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి: https://cets.apsche.ap.gov.in/EAPCET
  • హోమ్‌పేజీలో కనిపించే “డిక్లరేషన్ ఫారం” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • తరువాత, మీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నంబర్ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, మరియు మొబైల్ నంబర్ నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • మీ డిక్లరేషన్ ఫారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులోని అన్ని వివరాలను జాగ్రత్తగా మళ్లీ నింపి, సబ్మిట్ చేయండి.
  • ముఖ్య గమనిక: ఫారం సబ్మిట్ చేసే ముందు, మీరు నింపిన అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ఈ ప్రక్రియ తప్పనిసరి.

AP EAMCET 2025 Declaration Form Link

AP IIIT 2025 2nd Phase రిజల్ట్స్ విడుదల

ఎంపిక చేసిన ప్రాసెస్ ద్వారా, AP EAMCET మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అర్హత సాధించిన విద్యార్థులందరూ డిక్లరేషన్ ఫారమ్‌ను వెంటనే సమర్పించాలి.

మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .

Leave a Comment