AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి సంబందించిన అభ్యంతరాలు (గ్రీవెన్స్) ఫై 2025 సంవత్సరానికి సంబంధించి శుభవార్త. జూన్ 12 నుండి జూన్ 20 వరకు డబ్బులు అందని తల్లులు తమ అభ్యంతరాలను నమోదు చేసిన తర్వాత, సంబంధిత అధికారులు పరిశీలన చేసి, కొన్ని లబ్ధిదారులను తల్లికి వందనం పథకానికి “Eligible” గా గుర్తించి, రెండవ జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు మూడు పద్ధతులు ఉన్నాయి. ధరించిన రెండవ జాబితా కావలసిన విధంగా ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా వివరణ తెలుసుకుందాం.
తల్లికి వందనం పథకం 2వ జాబితా సిద్ధం చేశారు:
తల్లికి వందనం పథకంలో మొదటి విడతలో డబ్బులు రాలేదనుకుంటే, అభ్యంతరాలు (గ్రీవెన్స్) పెట్టుకున్న లబ్ధిదారుల పత్రాలను గ్రామ సచివాలయం అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియలో, చాలామంది లబ్ధిదారులను అర్హులుగా (ELIGIBLE) పరిగణించి, రెండవ జాబితా సిద్ధం చేశారు. ఈ రెండవ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన ప్రతి విద్యార్థికి స్కూల్‌కి వెళ్లే ఖర్చుకు ₹13,000/- చొప్పున వారి తల్లి అకౌంట్లో నగదు డిపాజిట్ చేయనున్నారు.
ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు: Official
2వ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మీకు 3 మార్గాలు ఉన్నాయి:
తల్లి కి వందనం పథకానికి అర్హులైనా కాదా అనేది చెక్ చేసుకోవడానికి పద్ధతులు:
- వాట్సాప్ ద్వారా:
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన “మనమిత్ర వాట్సాప్ సేవల” ద్వారా తల్లి కి వండనం పథకానికి అర్హులకాదా అనేది చెక్ చేసుకోవలసి ఉంటుంది.
- ముందుగా మనమిత్ర వాట్సాప్ నంబర్ “+91 95523 00009” ను మొబైల్ లో సేవ్ చేయండి.
- “హాయ్” అని మెసేజ్ పంపండి.
- అక్కడ సేవలను ఎంచుకోండి అని వస్తుంది, ఆప్షన్ మెను లో తల్లి కి వందనం పథకాన్ని ఎంపిక చేయండి.
- లబ్ధిదారుని 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే మీకు స్క్రీన్ పై ఈ పథకానికి అర్హులా కాదా అనేది మెసేజ్ రూపంలో వస్తుంది.
- వెబ్సైట్ ద్వారా:
- తల్లి కి వందనం పథకం రెండవ విడత జాబితా అర్హత స్టేటస్ చెక్ చేసుకోవడానికి ముందుగా ఈ వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ఓపెన్ చేయండి.
- అక్కడ తల్లి కి వందనం పథకాన్ని ఎంపిక చేసి 2025-26 సంవత్సరాన్ని సెలెక్ట్ చేయండి.
- లబ్ధిదారుని ఆధార్ నెంబర్ (UID) ఎంటర్ చేయండి.
- “Get OTP” పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటిపి వస్తుంది, ఆ OTP ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- స్క్రీన్ పై మీకు ఈ పథకానికి అర్హులా కాదా అనేది చూపిస్తుంది. (ELIGIBLE / OPEN / CLOSE ఆప్షన్స్ కనబడతాయి).
- గ్రామ సచివాలయం ద్వారా:
- ఆన్‌లైన్ విధానంలో స్టేటస్ చెక్ చేసుకోలేని వారు, మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ని సంప్రదించి రెండవ జాబితా చెక్ చేసుకోండి.
- ఆ రెండవ జాబితాలో మీ పేరు ఉంటే, మీరు ఈ పథకానికి అర్హులైనారు అని ఉంటుంది. ఈయెకు జూలై 5వ తేదీన ₹13,000/- అకౌంట్లో నేరుగా డబ్బులు డిపాజిట్ అవుతాయి.
అన్నదాత సుఖీభవ పథకంపై బిగ్ అప్‌డేట్..!
₹13,000/- ఎప్పుడు డిపాజిట్ అవుతాయి?:
- తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారుల తల్లుల అకౌంట్లో
- జూలై 5వ తేదీన ₹13,000/- డిపాజిట్ అవుతాయి.
- డిపాజిట్ అయిన వెంటనే మీకు ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ వస్తుంది.
- మీ అకౌంట్లో ఉన్న టోటల్ బ్యాలెన్స్ చూడండి.
- డబ్బులు డిపాజిట్ అయ్యాయా లేదా అని వెరిఫై చేసుకోండి.

రెండవ విడత జాబితాలో పేరు లేని వారి పరిస్థితి ఏమిటి?:
- తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో పేరు లేని వారు ఉండాలి.
- మరొక విడత జాబితా వచ్చే వరకు వేచి ఉండాలి.
- లేదా మరుసటి సంవత్సరంలో కూడా ఇదే పథకాన్ని అమలు చేస్తారు.
- ఈసారి లబ్ధిదారులు సరైన పత్రాలను సబ్మిట్ చేయాలి.
మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .