మీ ఇంటి వద్దనే ఉన్న పోస్టల్ ఆఫీస్ ద్వారా నెలకు ₹40,000/- వరకు ఆదాయం పొందే అవకాశం : వెంటనే Apply చెయ్యండి

Indian Postal Franchise Outlet Scheme 2025:

నేడు ప్రభుత్వ రంగంతో అనుబంధంగా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారికి “ఇండియా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్కీం 2025” మంచి అవకాశాన్ని అందిస్తోంది. మీ వద్ద ఒక చిన్న షాప్ లేదా గది ఉంటే సరిపోతుంది, ఈ విధంగా మీరు పోస్ట్ ఆఫీస్ సేవలను అందించడానికి అధికారిగా మారి, ఉద్యోగం కాకుండా వ్యాపారంగా ఆకర్షణీయమైన అవకాశాన్ని అనుభవించవచ్చు. ఈ స్కీమ్ ద్వారా, మీరు ప్రభుత్వ సేవలకు సంబంధించిన బ్రాంచ్‌లా పనిచేసే ఒక చిన్న ఆఫీసులో మీ పోస్టల్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఈ స్కీమ్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ ఎందుకు ఫ్రాంచైజీలకు అవకాశం ఇస్తుంది?:

భారతదేశంలో పోస్టల్ వ్యవస్థ విస్తృతంగా ఉండున్నా, కొన్ని గ్రామాలు మరియు పట్టణాలకు ఇప్పటికీ అవసరమైన పోస్టల్ సేవలు అందుబాటులో లేకపోవచ్చు. ఇలాంటి ప్రాంతాలలో నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి, అక్కడ అందుబాటులో ఉన్న వ్యాపారాలను భాగస్వామ్యంగా తీసుకోవడం ఈ ఫ్రాంచైజీ లక్ష్యం.

ఇంటి నుండి చేసే ఉద్యోగాలు – ఇంటర్ అర్హత-తెలుగులో

పోస్టల్ ఫ్రాంచైజీ ద్వారా అందించే సేవలు ఇవే :

  • స్పీడ్ పోస్ట్ మరియు రిజిస్టర్ పోస్టులను బుక్ చేయడం
  • స్టాంపులు మరియు పోస్టల్ స్టేషనరీ విక్రయించడం
  • MONEY ఆర్డర్స్ చేయడం
  • పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్షన్ చేయడం
  • ఇ-గవర్నెన్స్ సేవలు, బిల్లుల చెల్లింపులు మరియు ఇతర సర్వీసులు అందించడం

మీకు ఆదాయం ఎలా వస్తుంది?:

  • ఫ్రాంచైజీ ద్వారా ఆదాయం: మీరు అందించే ప్రతి సేవలకు కమిషన్ రూపంలో ఆదాయం వస్తుంది.
  • స్పీడ్ పోస్ట్ ల కమీషన్: 7% నుంచి 25% వరకు.
  • మనీ ఆర్డర్ల కమీషన్: ₹3 రూపాయల నుంచి ₹5 రూపాయల వరకు.
  • స్టాంపులపై లాభం: 5% శాతం వరకు.
  • నెల వారికి ఆదాయం: కొన్ని ప్రాంతాల్లో నెలకు ₹15,000/- నుంచి ₹40,000/- వరకు ఆదాయం పొందవచ్చు.

నిరుద్యోగులకు శుభవార్త.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

ఈ ఫ్రాంచైజీని మీరు ఓపెన్ చేయడానికి కావలసినవి:

  • అర్హత: 8వ తరగతి / 10వ తరగతి
  • వయస్సు: 18 సంవత్సరాలు పైబడినవారు అర్హులు.
  • కనీసం 100 Sq.ft స్థలం ఉండాలి.
  • ₹5,000/- నుండి ₹10,000/- వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి.
  • బేసిక్ కంప్యూటర్ లేదా మొబైల్ నాలెడ్జి ఉండాలి.
  • 18 ఏళ్ల వయస్సు పైబడి ఉండాలి.

AP పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు ₹6,000/- అకౌంట్ లో జమ చేయనున్న ప్రభుత్వం: ఇలా Apply చెయ్యండి

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

మీ ఇంటి వద్ద పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేయడానికి ఈ క్రింది స్టెප් బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి:

  1. దరఖాస్తు ఫారం డౌన్లోడ్India Post నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోండి.
  2. దరఖాస్తు సమర్పణ: మీ జిల్లాలోని పోస్టల్ డివిజనల్ కార్యాయలో ఆ దరఖాస్తును సమర్పించండి.
  3. స్థలం పరిశీలన: మీ దరఖాస్తు పై స్థలం పరిశీలన మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  4. MOU (Memorandum of Understanding): తుది నిర్ణయంగా ఫ్రాంచైజీ మంజూరు అవుతుంది, దీనికి అవసరమైన MOU సంతకం చేయాలి.
  5. ట్రైనింగ్: అవసరమైన ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత, మీరు మీ ఇంటి వద్ద పోస్టల్ సేవలు అందించవచ్చు.

ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు ఫ్రాంచైజీని పొందవచ్చు.

Notification & Application Form

Official Website

  • మీ దగ్గర చిన్న వ్యాపారం లేదా ఖాళీ షాప్ ఉంటే అది ప్రభుత్వ సేవల కేంద్రంగా మార్చవచ్చు.
  • తక్కువ పెట్టుబడితో నెలకు స్థిర ఆదాయం పొందే అవకాశం ఉంది.
  • ఇది ఉద్యోగం కాదు, కానీ ఉద్యోగం లాంటి భద్రత కలిగించే వ్యాపారం.
  • పోస్టల్ డిపార్ట్మెంట్ తో అనుబంధంగా కలిసి పనిచేయవచ్చు.

AP Thalliki Vandanam Scheme 2025:

మా వెబ్‌సైట్ @ www.Jobsbin.in ని సందర్శించండి .

1 thought on “మీ ఇంటి వద్దనే ఉన్న పోస్టల్ ఆఫీస్ ద్వారా నెలకు ₹40,000/- వరకు ఆదాయం పొందే అవకాశం : వెంటనే Apply చెయ్యండి”

Leave a Comment