TS Inter Supplementary Exams 2025:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు నిన్న మంగళవారం ముగిసాయి. మిగిలిన పరీక్షలు మే 29వ తేదీ వరకు నిర్వహించబడతాయి. అయితే, ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడగా, వారిని పరీక్షల నుంచి డిబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షలను 4.12 లక్షల మంది విద్యార్థులు రాశారు. ప్రధాన పరీక్షలు మే 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు కొనసాగాయి, మరియు మిగిలిన పరీక్షలను 28, 29 తేదీల్లో పూర్తి చేయడం జరుగుతుంది.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష పేపర్ల మూల్యాంకనాన్ని రేపటి నుండి 19 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వచ్చే నెల జూన్ రెండవ వారంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
TS ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షల రిజల్ట్స్ డేట్:
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నిన్నటితో ప్రధాన పరీక్షలు ముగిసాయి. రేపటి నుండి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ప్రారంభంకానుంది. పేపర్ల మూల్యాంకనం పూర్తైన తర్వాత, వచ్చే నెల జూన్ రెండవ వారంలో ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎలా చూసుకోవాలి?
సప్లిమెంటరీ రాత పరీక్షలకు హాజరైన విద్యార్థులు, క్రింద ఇచ్చిన స్టెప్ బై స్టెప్ ప్రక్రియను అనుసరించటం ద్వారా తమ ఫలితాలను చూడవచ్చు.
- ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ tsbie.cgg.gov.in ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో “Telangana Inter 1st Year and 2nd Year Supplementary Exams 2025 Results” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
- వెంటనే, స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.
Marks
Results